Sunday, October 22, 2017

Sivam ... Sivoham ...

Sivudu ante kalyanakaari ... Subhalu kalugajesee vaadu ... amduke Adi devudu aayana ...
 Devunikantu oka roopam ledani nirupinchindi aayana ... Amduke aayana linga rupamlo punimpa badutunnadu ... Amduke evariki nachinattuga vaaru ayannu lingaa kaaramlo pujistunnaru sarvam sivamastu Ani ... Amduke devatalu, rushulu, manushulu pratistincharu ...

దైవికాలు, ఆర్షకాలు, మానుషాలు

Siva is the greatest of all dancers ... Natarajan roopam ade ...

 4 చేతులు పరవశ తాండవ రూపమే మనకు బాగా పరిచయమున్న మూర్తి.  వనియులకుడనే రాక్షసుని మీద నిలబడిన శివుడు ఒంటరిగా నాట్యం చేస్తుంటాడు. amdulo aneka roopalunnai ...

సృష్టి, స్థితి, లయ కారకుడై శివుని నాట్య రూపం..
నటరాజ రూపం

He is a good teacher also ... Adi guruvu .
Ade ...
దక్షిణామూర్తి ane roopam బుుషులకు బోధ చేసే రూపం.


Tuesday, June 27, 2017

వేదాలు - ఉప అంగాలు

వేదాలు వాటి విలువ గురించి చెప్పాలంటే కష్టమే ...

నాలుగు వేదాల గురించి, ప్రతి వేదం మూడు భాగాలుగా విభజింపబడింది అని తెలుసుకున్నాము ...

ఈ రోజు ఆ మూడు భాగాలు ఎందుకో తెలుసుకొందాము ...
సంహిత
ఈ భాగం దేవతలను ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలియజేస్తుంది ...
అంటే దేవతలను స్తుతించడం ఎలాగో తెలుపుతుంది ...
క్లుప్తం గా చెప్పాలంటే దేవతా ప్రార్ధనల గురించి కూలంకషంగా వివరిస్తుంది ...

బ్రాహ్మణం
ఈ భాగం యజ్ఞ యాగాది క్రతువులు ఎలా నిర్వహించాలో తెలియజేస్తుంది ...
అంటే యాగం నికి అవసరమైన సామగ్రి నుండి శ్లోకాలతో ఎలా నిర్వహించాలో వివరిస్తుంది
క్లుప్తం గా చెప్పాలంటే  యాగ వివరాలను  కూలంకషంగా తెలుపుతుంది ...

అరణ్యకం 
ఈ భాగం రెండు ముఖ్యమైన వివరాలను తెలియజేస్తుంది ...
అవి

1 ఉపనిషత్తులు

2. చరమ సత్యం

మరియొక రోజు ఈ మూడవ భాగంలోని మొదటిది అయిన  ఉపనిషత్తులు గూర్చి తెలుసుకొందాము ...
ఈ రోజు ఇంతటితో ముగిస్తున్నాను సమయాభావం వల్ల ... సశేషం

స్వస్తి

మీ      శ్రీ


Wednesday, June 21, 2017

వేదాలు - రకాలు - భాగాలు

 శుభోదయం ...

చాలా కాలం తర్వాత నేను మళ్లీ ఈ మంచి రోజున  మీ తో మాట్లాడుతున్నాను ...

ఈ రోజు మనం వేదాలు ఎన్నిరకాలు ? ప్రతి వేదం ఎన్ని ప్రధాన భాగాలుగా విభజింప బడిందో తెలుసుకొందాం ...

ఇంజనీరింగ్ చదివినా ఇవన్నీ ఎందుకు చెప్పుతున్నా నంటే ప్రాచీన కాలంలో మనం ఏంథి మందికి విజ్ఞానంను అందించాం ... నలందా, తక్షశిల మరెన్నో విశ్వవిద్యాలయాలు విదేశీయులకు విద్యను ప్రసాదించాయి ... ఇవన్నీ మన వేద, పురాణ , ఇతిహాస, వైద్య గ్రంథాలలో ఉన్నవే ... ఒక ఉదాహరణ ఇస్తాను ... టైం (కాలం ) గురించిన ప్రస్తావన మన శ్రీ మద్భాగవతం లో ఉంది ... మరొక సారి దాని గురించి తెలియజేయగలను ... సమయా భావం వాళ్ళ ...

ప్రస్తుతం వేదం గురించి మాట్లాడుకుందాం  ...
వేదాలు అంతం లేనివి ... మన ఋషులు చెప్పిన వేదాలు కొంత కాలం విస్మరించబడ్డాయి ...

కానీ అది తాత్కాలికంగానే ... కొన్ని విషయాలు మాత్రం మరుగున పడ్డాయి ... మళ్లీ ఆధునిక ఋషులు వాటిని ఆవిష్కరించిన తరవాత అవి నాలుగు భాగాలు గా క్రోఢీకరించబడ్డాయి (అసలు వేదాలు లెక్కించ లేనన్ని భాగాలు) ...

1. ఋగ్వేదం

2. యజుర్వేదం

3. సామ వేదం

4. అధర్వణ వేదం



వేదం మూడు ప్రధాన భాగాలుగా వర్గీకరింపబడింది ...

1. సంహిత

2. బ్రాహ్మణం

3. అరణ్యకం

మళ్లీ ఇంకో రోజు

నాలుగు వేదాలలో ఏ వేదం ఎందుకు ?

దాని మూడు ప్రధాన భాగాలు ఏమి వివరిస్తున్నాయి అనేది తెలుసుకొందాం ...

స్వస్తి

మీ శ్రీ 

Wednesday, March 22, 2017

వేదాలు ... విజ్ఞానం

 వేదాలు  ఈ జగత్తు లోనే  అత్యంత ప్రాచీనమైన గ్రంథాలు  ...

తత్వ లోకమునకు మార్గములు ... అవి అంత పురాతనమైనవి అయినా నిత్య నూతనాలు ...

నేటికీ అందు చెప్పబడినవి ఆచరణ యోగ్యాలు మరియు సత్యాలు ...

ఎందరో విదేశీ విద్యార్థులు ఈ హిందూ దేశానికి వచ్చి వీటిని నేర్చుకొని వెళ్లారు ...

వాటికి తార్కాణాలే తక్షశిల, నలంద లాంటి విద్యాలయాలు  ...

ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తలు గా గుర్తించబడిన వారందరు గ్రీకు మరియు ఇతర దేశాల వారే ...

సోక్రటీస్, ప్లేటో , అరిస్టాటిల్, మాకియవెల్లి, కార్ల్ మార్క్స్  ఇంకెందరో

వారినందరిని మనం ఎంతో గౌరవిస్తున్నాము

 కానీ మన నిజమైన తత్వవేత్తలు  ఋషులే ...

కానీ వారిలో కొందరే వారి పేరును బహిర్గతం చేసుకొన్నారు కానీ చాలా మంది వారి పేరును తెలియచేయలేదు ... కారణం వారి అంతిమ లక్ష్యం సామాన్య జనులకు తత్వ బోధన  ...

అంతే కానీ వారు గొప్ప వారీగా గుర్తింపబడాలని కోరుకోలేదు ...

ఉదాహరణకు ఉపనిషత్తులు మునుల పేరు మీద ఉన్నాయి


మనకు తెలిసింది వ్యాస మహర్షి వేదాలను వ్రాసారు ...

కానీ దాని వెనుక ఋషులుగా, మహర్షులుగా పిలవబడే ఎంతో మంది జీవిత అనుభవాలు ఉన్నాయ్ ...

మనం వారిని గౌరవించలేమా ... వారు ఇచ్చిన జ్ఞానము ను తెలుసుకొనలేమా ... మిగిలిన దేశాల వారిలానే ...




వేదాలు నాలుగు ...

సామవేదం

యజుర్వేదం

అధర్వణ వేదం

ఋగ్వేదం





మరిన్ని వేద విశేషాలు మరియొక పర్యాయం తెలుసుకొందాం ...  

స్వస్తి  ...